బీజేపీతో పాతికేళ్లు వృథా చేశాం

ABN , First Publish Date - 2022-01-24T06:38:55+05:30 IST

హిందూత్వ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ అధికారం కోసం వాడలేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా పేర్కొన్నారు. ...

బీజేపీతో పాతికేళ్లు వృథా చేశాం

 హిందుత్వాన్ని అధికారం కోసం ఎప్పుడూ వాడలేదు: ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై, జనవరి 23: హిందూత్వ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ అధికారం కోసం వాడలేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా పేర్కొన్నారు. మహారాష్ట్ర దాటి జాతీయస్థాయిలో విస్తరించేందుకు ఇకపై ప్రయత్నిస్తామని, బీజేపీ కూటమిలో శివసేన పాతికేళ్ల కాలాన్ని వృథా చేసిందని అభిప్రాయపడ్డారు. మున్ముందు జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషిస్తామని జోస్యం చెప్పారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్‌ ఠాక్రే 96వ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తల ఎదుట ఆయన ప్రసంగించారు. ‘‘శివసేన హిందూత్వానికి అధికారం అందించేందుకు బీజేపీతో జతకట్టింది. కానీ అధికారం కోసం ఎన్నడూ హిందూత్వాన్ని వాడుకోలేదు. మేం కేవలం బీజేపీని మాత్రమే విడిచిపెట్టాం. హిందూత్వాన్ని కాదు. బీజేపీది అధికారం కోసం మిత్రులను వాడుకుని వదిలేసే అవకాశవాదం. జాతీయస్థాయిలో ఉండాలనుకున్న బీజేపీ లక్ష్యాలకు మేం సహకరించాం. కానీ ఆ పార్టీ మాకు వెన్నుపోటు పొడిచింది. మా ఇంటిలోనే మమ్మల్ని నాశనం చేసేందుకు యత్నించింది’’ అని ఉద్ధవ్‌ మండిపడ్డారు.   

Updated Date - 2022-01-24T06:38:55+05:30 IST