HICCలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-02T22:24:44+05:30 IST

భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు(bjp national excutive meetings) శనివారం హెచ్ఐసిసి(hicc) లో ప్రారంభమయ్యాయి.

HICCలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు(bjp national excutive meetings) శనివారం హెచ్ఐసిసి(hicc) లో ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరయ్యారు.రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశాలు జరుపుకుంటున్నారు. ఈసమావేశాల్లోనే 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను పార్టీ హైకమాండ్ సిద్ధం చేయనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరగనున్నాయి. తెలంగాణలో బిజెపి పాగా వేయడానికి ప్రధాన మంత్రి మోదీ రోడ్‌మ్యాప్‌ ఇవ్వనున్నారు. 

Updated Date - 2022-07-02T22:24:44+05:30 IST