‘గాడ్సే జిందాబాద్’ ట్వీట్లపై వరుణ్ గాంధీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-02T22:18:11+05:30 IST

గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను కీర్తిస్తూ

‘గాడ్సే జిందాబాద్’ ట్వీట్లపై వరుణ్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ : గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను కీర్తిస్తూ ట్వీట్ చేసినవారిపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివారు బాధ్యతారహితంగా దేశాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. గాంధీజీ మనకు గొప్ప నైతిక బలాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. గాంధీ జయంతి నేపథ్యంలో ‘‘నాథూరాం గాడ్సే జిందాబాద్’’ ట్విటర్‌లో ట్రెండ్ అవుతుండటంతో వరుణ్ గాంధీ స్పందించారు. 


‘‘భారత దేశం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక సూపర్‌పవర్, అయితే తన ఉనికి ద్వారా మన దేశ ఆధ్యాత్మిక మూలాలను వివరించినది, నేటికీ మనకెు గొప్ప బలంగా నిలిచే  నైతిక అధికారాన్ని కల్పించినది మహాత్మా గాంధీయే’’ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. 


గాంధీజీ 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్పులు జరపడంతో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-10-02T22:18:11+05:30 IST