హైదరాబాద్: గతంలో కేంద్రానికి అనేక బిల్లుల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు సహకరించారని బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రాన్ని బ్లేమ్ చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం కొందరు ధాన్యం అంశాన్ని వాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో టూరిజం అభివృద్ధిలో సహకరిస్తామని ఆయన తెలిపారు.