నవ్యాంధ్రను నీరు గార్చేలా బడ్జెట్‌: జీవీఎల్‌

ABN , First Publish Date - 2022-03-12T00:47:42+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవ్యాంధ్ర కలను నీరు గార్చే బడ్జెట్‌‌లా

నవ్యాంధ్రను నీరు గార్చేలా బడ్జెట్‌: జీవీఎల్‌

ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవ్యాంధ్ర కలను నీరు గార్చే బడ్జెట్‌‌లా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఏపీ బడ్జెట్‌పై నిరాసక్తత కనిపించిందన్నారు. కేంద్రం నిర్మించే పథకాలను రాష్ట్రం తమవి అని చెప్పుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, వచ్చే ఆదాయం వడ్డీ కట్టడానికి సరిపోయేలా లేదన్నారు. కులాల కార్పొరేషన్ల నిధులు, వాళ్లకు వెళ్ళటం లేదన్నారు. పేరుకి మాత్రమే కార్పొరేషన్లు అని, అక్కడ టీ తాగేందుకు కూడా డబ్బులు లేవన్నారు. కార్పొరేషన్లకు నిధులిచ్చే చిత్తశుద్ధి ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. బడ్జెట్‌లో తప్పులు చూపెట్టారన్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన బడ్జెట్‌లో ఎందుకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ వాటా ఎందుకు ఇవ్వలేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులేవన్నారు. బడ్జెట్‌ను పార్టీ మేనిఫెస్టో లాగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనెల 19న కడపలో బీజేపీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్లక్షానికి నిరసనగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2022-03-12T00:47:42+05:30 IST