BJP MLC: రైల్వేజోన్ రాదని మీడియాలో వార్తలు దురదృష్టకరం

ABN , First Publish Date - 2022-09-29T18:14:08+05:30 IST

ఏపీకి రైల్వే జోన్ రాదని మీడియాలో వార్తలు రాయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

BJP MLC: రైల్వేజోన్ రాదని మీడియాలో వార్తలు దురదృష్టకరం

విశాఖపట్నం: ఏపీకి రైల్వే జోన్ రాదని మీడియాలో వార్తలు రాయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్సీ (BJP MLC) మాధవ్ (Madhav) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను 2019లో ప్రకటించామని... ఏపీ (Andhrapradesh)కి జోన్ రావడం గొప్ప విషయమని అన్నారు. ఎన్నో అసాధ్యమైన విషయాలను.. తాము సుసాధ్యం చేశామని చెప్పారు. విభజన హామీల్లో రైల్వేజోన్ తప్పని సరిగా ఇవ్వాలని చెప్పలేదని.. అయినా జోన్ సాధించామని చెప్పారు. త్వరలోనే ప్రధాని (PM Modi) చేతుల మీదగా రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తామని అన్నారు. గత బడ్జెట్‌లో జోన్ కోసం నిధులు కేటాయించామని, పోలవరం ప్రాజెక్టు నిధులు ఇస్తున్నామని తెలిపారు. 2019  పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని... వైసీపీ (YCP), టీడీపీ (TDP) ప్రభుత్వాల కారణంగానే ఆలస్యం అవుతోందన్నారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని తెలిపారు. కేంద్రానికి అన్ని చెప్పే చేస్తున్నామని ఒకరు.. బీజేపీ(BJP) తమతో వస్తుందని ఇంకొకరు చెప్పుకుంటున్నారని  మాధవ్ (BJP MLC) అన్నారు. 

Updated Date - 2022-09-29T18:14:08+05:30 IST