దళితబంధుపై కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: Raghunandhan

ABN , First Publish Date - 2021-10-19T18:29:25+05:30 IST

దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు వ్యాఖ్యలు చేశారు.

దళితబంధుపై కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: Raghunandhan

హైదరాబాద్: దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన దళితబంధుపై హుజురాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దళితులకు మూడెకరాల భూమి మాదిరే ... దళితబంధు పథకం కూడా అని అన్నారు. తమకు పది లక్షలు ఇచ్చే ఆలోచన కేసీఆర్‌కు లేదని హుజురాబాద్ ప్రజలే మట్లాడుకుంటున్నారని తెలిపారు. దళితబంధును ఆపమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మానాభరెడ్డి ఈసీకి ఆగస్టులోనే లేఖ రాశారన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా ఎందుకు ఫ్రీజ్ చేశారో కేటీఆర్  చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలటం వలనే కేటీఆర్ హుజురాబాద్‌లో ప్రచారానికి రావటం లేదని అన్నారు. ఈటల సంగతి అటుంచితే.. హరీష్ రావే కాంగ్రెస్‌లోకి వస్తున్నాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారన్నారు.  కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవుతోందనే హుజురాబాద్ రావటానికి రేవంత్‌కు ముఖం చెల్లటం లేదని రఘునందనరావు అన్నారు. 


Updated Date - 2021-10-19T18:29:25+05:30 IST