నిజామాబాద్: బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు భౌతిక దాడులు చేస్తే ప్రజలే వారికి గుణపాఠం చెప్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆర్మూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు తాబేదారులుగా మారారని, దాన్ని నివారించడానికే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. అధికారులు దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఫిర్యాదు చేసిన వారిపైనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి