Abn logo
Oct 12 2021 @ 16:06PM

Harishraoకు ఈటల గెలవాలని ఉంది : బీజేపీ ఎమ్మెల్యే

కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు అనుకుంటున్నారని.. ఈ మాటలు తనతో పోలీసులు చెప్పారని ఎమ్మెల్యే రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం నాడు హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే 119లో 103వ ఎమ్మెల్యే అవుతారు. ఈటల రాజీనామ చేస్తేనే అభివృద్ధి చేస్తున్నారు. మొన్న నన్ను వెల్లగొట్టారు.. నిన్న రాజేందర్‌ని, రేపు హరీష్ రావును టీఆర్ఎస్ నుంచి వెల్లగొడతారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో హరీష్ రావు తప్పుడు లెక్కలు చెబుతున్నారు. నై తెలంగాణ అన్న గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఇచ్చారు’ అని రఘునందన్ చెప్పుకొచ్చారు. కాగా.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసింది మొదలుకుని ఇప్పటి వరకూ బీజేపీ-టీఆర్ఎస్ నేతలు, మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సవాళ్లు, ప్రతి సవాళ్లు.. విమర్శలు, ప్రతి విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.


ఇవి కూడా చదవండిImage Caption