azaan, Iftar partyని వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-05-02T16:48:43+05:30 IST

లౌడ్ స్పీకర్లలో అజాన్ వినిపించడం, యూనివర్శిటీలో ఇఫ్తార్ విందు ఏర్పాటును బీహార్ బీజేపీ ఎమ్మెల్యే వ్యతిరేకించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది....

azaan, Iftar partyని వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే

పాట్నా: లౌడ్ స్పీకర్లలో అజాన్ వినిపించడం, యూనివర్శిటీలో ఇఫ్తార్ విందు ఏర్పాటును బీహార్ బీజేపీ ఎమ్మెల్యే వ్యతిరేకించిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. గతనెల 26వతేదీన లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సరోగి వ్యతిరేకించారు. విద్యా సంస్థలను మత స్థలాలుగా మార్చడాన్ని తాము సహించబోమని సంజయ్ చెప్పారు. యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌ను లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. విద్యా సంస్థలను మత స్థలాలుగా మార్చడంపై తాను గవర్నర్‌కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే చెప్పారు.రిజిస్ట్రార్‌ ముస్తాక్‌ అహ్మద్‌ ఇఫ్తార్ విందుల కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై అహ్మద్ సమాధానమిచ్చారు. 


ఇఫ్తార్‌ను యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించలేదని,ఈ విందుకు యూనివర్శిటీకి సంబంధం లేదని అహ్మద్ వివరణ ఇచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కొందరు విద్యార్థులు నిర్వహించారని, తప్పుడు మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని రిజిస్ట్రార్ అన్నారు.‘‘ఒక విద్యా సంస్థలో ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయగలిగితే, దుర్గాపూజ కూడా అక్కడ జరుపుకోవాలి’’ అని యూనివర్శిటీ సిండికేట్ సభ్యురాలు మీనా ఝా అన్నారు. కాగా ఇఫ్తార్ పార్టీ నిర్వహణకు యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చిందని జేడీయూ నేత ఇంజమ్ముల్ హక్ చెప్పారు. పలువురు నేతలతో పాటు యూనివర్సిటీ ఉద్యోగులు, అధికారులు కూడా ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు.ఇఫ్తార్ విందు ఏర్పాటును ప్రశ్నించే వారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే పని చేస్తున్నారని జేడీయూ నేత ఆరోపించారు.


Updated Date - 2022-05-02T16:48:43+05:30 IST