రాష్ట్రానికి బలమైన హోంమంత్రి కావాలి

ABN , First Publish Date - 2022-04-19T17:19:58+05:30 IST

పార్టీ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ సంచలనమైన వ్యాఖ్యలకు తెరలేపారు. కర్ణాటకకు బలమైన హోంశాఖ మంత్రి

రాష్ట్రానికి బలమైన హోంమంత్రి కావాలి

                              - బీజేపీ ఎమ్మెల్యే ఎద్దేవా 


బెంగళూరు: పార్టీ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ సంచలనమైన వ్యాఖ్యలకు తెరలేపారు. కర్ణాటకకు బలమైన హోంశాఖ మంత్రి కావాలని ప్రకటన ఇవ్వాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విజయపురలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా గొడవలు లేవని కానీ కర్ణాటకలో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. ఎక్కడ గొడవలకు కారణమవుతున్నాయో అక్కడ నియంత్రించాలంటే హోం మంత్రి శక్తివంతుడై ఉండాలన్నారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్రానికి ఒక శక్తివంతమైన హోం మినిస్టర్‌ కావాల్సి ఉందన్నారు. 

Updated Date - 2022-04-19T17:19:58+05:30 IST