fake certificate case: నకిలీ సర్టిఫికెట్‌తో భార్యను ఎన్నికల్లో నిలబెట్టిన బీజేపీ ఎమ్మెల్యే జైలుపాలు!

ABN , First Publish Date - 2021-07-13T12:05:30+05:30 IST

నకిలీ సర్టిఫికెట్‌తో భార్యను ఎన్నికల్లో...

fake certificate case: నకిలీ సర్టిఫికెట్‌తో భార్యను ఎన్నికల్లో నిలబెట్టిన బీజేపీ ఎమ్మెల్యే జైలుపాలు!

జైపూర్: fake certificate case నకిలీ సర్టిఫికెట్‌తో భార్యను ఎన్నికల్లో నిలబెట్టిన ఉదంతంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పరిధిలోగల సలూంబర్ బీజేపీ ఎమ్మెల్యే అమృత్ లాల్ మీణాను న్యాయస్థానం జైలుకు పంపించింది. అమృత్‌లాల్ మీణా 2015లో నకిలీ సర్టిఫికెట్ సాయంతో తన భార్య శాంతి మీణాను ఎన్నికల్లో నిలబెట్టారు. ఈ ఉదంతంలో భార్య అరెస్ట్ అయ్యింది. ఇప్పడు విచారణలో ఎమ్మెల్యే వంతు వచ్చింది. సహాఢా సివిల్ కోర్టు సదరు ఎమ్మెల్యే  బెయిల్ పిటీషన్‌ను కొట్టివేస్తూ, అతనిని జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. 


కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యే అమృత్ లాల్ మీణాను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, తాను న్యాయం కోసం అడిషినల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుకు వెళతానని ఎమ్మెల్యే చెబుతున్నారు. కాగా సెమారీ సర్పంచ్ శాంతి మీణాపై ఎజీఎం కోర్టులో కేసు దాఖలయ్యింది. దానిలో ఆమె నకిలీ ఐదవ తరగతి సర్టిఫికెట్ ఆధారంగా ఎన్నికల్లో గెలిచినట్లు ఆరోపించారు. ఇది ఎమ్మెల్యే అమృత్ లాల్ చొరవతోనే జరిగిందని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-13T12:05:30+05:30 IST