ఒక్కసారి వస్తే ఎప్పటికీ ఉంటాం

ABN , First Publish Date - 2022-07-01T05:52:15+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం బీజేపీ జాతీయ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ సభకు జన సమీకరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఒక్కసారి వస్తే ఎప్పటికీ ఉంటాం
నారాయణఖేడ్‌లో మాట్లాడుతున్న రాజీవ్‌ ప్రతా్‌పరూడీ

తెలంగాణలో బీజేపీ జెండా ఎగుర వేస్తాం 

టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం

నరేంద్రమోదీతో అంతర్జాతీయంగా భారత్‌కు గుర్తింపు

కార్యకర్తలతో సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు


నారాయణఖేడ్‌, జూన్‌ 30: సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం బీజేపీ జాతీయ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ సభకు జన సమీకరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తిరుగుండదని మాజీ కేంద్ర మంత్రి, బీహార్‌ ఎంపీ, రాజీవ్‌ప్రతా్‌పరూడీ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తున్నదన్నారు. రామ మందిర నిర్మాణం, కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు, ముస్లిం మహిళల కోసం  త్రిపుల్‌ తలాక్‌ రద్దు, జన్‌ధన్‌, అవినీతి రహిత పాలన బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ సాధించిన ఘనతలని గుర్తు చేశారు. తెలంగాణలోనే కాదు కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగినా బీజేపీనే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగే విజయసంకల్ప సభను వియజవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రవిగౌడ్‌, నియోజకవర్గ కన్వీనర్‌ మారుతిరెడ్డి, పట్టణ కన్వీనర్‌ రామకృష్ణ, నాయకులు శేరిరామకృష్ణ, కోణం విఠల్‌, శివాజీపాటిల్‌, విఠల్‌రెడ్డి, బన్సీలాల్‌, నగేష్‌, సంతోష్‌, సిద్ధయ్యస్వామి, రాజుగౌడ్‌, బి.సతీ్‌షకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

సంగారెడ్డి అర్బన్‌/జిన్నారం: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పతనం ఖాయమైందని రాజస్థాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి గులాబ్‌చంద్‌ కఠారియా పేర్కొన్నారు. గురువారం ఆయన సంగారెడ్డి, కంది, కొండాపూర్‌, సదాశివపేట మండలాల్లో బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే ఆధరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జి దేశ్‌పాండే, నాయకులు నర్సారెడ్డి, హన్మంత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రాములు, రవిశంకర్‌, డాక్టర్‌ రాజుగౌడ్‌, రమేశ్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, జిన్నారంలో నిర్వహించిన బీజేపీ నాయకుల సమావేశానికి జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు రాజా, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆనంద్‌భాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌ హాజరయ్యారు. ప్రధాని మోదీ బహిరంగ సభపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 


బీజేపీతోనే అభివృద్ధి

జహీరాబాద్‌: బీజేపీతోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమని కర్ణాటక రాష్ట్రం కలబుర్గి ఎంపీ డాక్టర్‌ ఉమే్‌షజాదవ్‌ పేర్కొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలో ఆయన గురువారం బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా.. నరేంద్రమోదీ పరిపాలనా దక్షతతోనే భారత్‌ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని స్పష్టం చేశారు. ఓవైపు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. 


మెదక్‌ జిల్లాలో..

నర్సాపూర్‌: రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు శివప్రతా్‌పశుక్ల పేర్కొన్నారు. నర్సాపూర్‌లో గురువారం ఆయన నియోజకవర్గ నాయకులతో సమావేశమై ప్రధాని నరేంద్రమోదీ సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్టు ఉందని, స్వరాష్ట్రంలో ఆయన ఆయన కుటుంబమే  బాగుపడిందని విమర్శించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 200 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో 80 ఏయిర్‌పోర్టులను నిర్మించామని తెలిపారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన జాతీయ రహదారులన్నీ కేంద్ర ప్రభుత్వమే నిర్మించిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డంశ్రీనివాస్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి సింగాయపల్లిగోపి, నాయకులు సురేష్‌, రాజేందర్‌, బుచ్చే్‌్‌షయాదవ్‌, రఘువీరారెడ్డి, రమే్‌షగౌడ్‌, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, శంకర్‌, అంజిగౌడ్‌, గంగారెడ్డి, నాగరాజు, ప్రేమ్‌యాదవ్‌ పాల్గొన్నారు. 


రాష్ట్రంలో మాటల ప్రభుత్వం 

తూప్రాన్‌: రాష్ట్రంలో ఉన్నది మాటల ప్రభుత్వమేనని బీజేపీ జార్ఖండ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు దీపక్‌ప్రకాష్‌ విమర్శించారు. తూప్రాన్‌లో గురువారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అబద్దాల పునాదులపై నిలబడిందని ఎద్దేవా చేశారు.  కేసీఆర్‌ కాంగ్రె్‌సతో కలిసి పోయారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్‌, రాంమోహన్‌గౌడ్‌, ఆంజనేయు లు, సాయిబాబాగౌడ్‌, నర్సోజీ, విఠల్‌, యాదగిరి, మహేశ్‌గౌడ్‌  పాల్గొన్నారు.


అందోలులో బాబుమోహన్‌, బాలయ్య వర్గీయుల బాహాబాహీ

జోగిపేట: ప్రధాని నరేంద్రమోదీ సభకు సన్నాహకంగా మాజీమంత్రి బాబుమోహన్‌ అధ్యక్షతన జోగిపేటలోని శ్రీరామా గార్డెన్స్‌లో పార్టీ అందోలు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. జాతీయ అధికార ప్రతినిధి, మహారాష్ట్రకు ఎంపీ ప్రేమ్‌శుక్లా హజరై దిశానిర్దేశం చేశారు. నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని సభకు భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. సభకు తరలివచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. అయితే సమావేశానికి తమను పిలువలేదని మాజీ జడ్పీ చైర్మన్‌ బాలయ్య వర్గీయులు నిరసనకు దిగారు. బాలయ్యతో పాటు జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ ఆర్‌.ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాబూమోహన్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. బాబూమోహన్‌ వర్గీయులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో మోదీ సభ ఇన్‌చార్జి, బీజేపీ ఓబీసీ సెల్‌ కన్వీనర్‌ ఆలె భాస్కర్‌, పుల్కల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అనంతరావు కులకర్ణి బాలయ్య, ప్రభాకర్‌గౌడ్‌తో పాటు వారి అనుచరులను బయటకు తీసుకువెళ్లారు. ప్రధానమంత్రి సభ ముందున్నప్పుడు ఇలాంటి ఘటనలు పార్టీకి మంచిది కాదని హితవు పలికారు. ఇంతటి ప్రాధాన్యమున్న సమావేశానికి తమను ఎలా పిలువలేదని అసమ్మతి నాయకులు ప్రశ్నించగా, మోదీ సభ అనంతరం సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆలె భాస్కర్‌ హామీ ఇచ్చారు. దీంతో బాలయ్య వర్గీయులు సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు.

Updated Date - 2022-07-01T05:52:15+05:30 IST