‘మోదీ పర్యటన విజయవంతం చేయాలి’

ABN , First Publish Date - 2022-07-01T05:35:10+05:30 IST

అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ 4న అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజేపి జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అన్నారు.

‘మోదీ పర్యటన విజయవంతం చేయాలి’
మేడపాడులో మాట్లాడుతున్న నార్ని తాతాజీ

యలమంచిలి / పోడూరు, జూన్‌ 30: అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ 4న అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజేపి జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అన్నారు. మేడపాడులో బీజేపీ మండల అధ్యక్షుడు దొంగ నర్శింహకుమార్‌ అధ్యక్షతన గురువారం జరిగిన మండల సమావేశంలో తాతాజీ ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. సమావేశంలో రైతుల ధాన్యం బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. జిల్లా ప్రధానకార్యదర్శి కోమట రవి, వీరా జయరామాంజనేయులు, కుక్కల కేశవరావు, పంజా ధర్మారావు, వల్లభు దుర్గాప్రసాద్‌, పంజా బాబులు, ఎం.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో జరిగిన మండల కమిటీ సమావే శంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కబర్ధి ఆయన మట్లాడారు. మోదీ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలివెళ్లాలన్నారు. మండల అధ్యక్షుడు నాగరాజు బదరీనారాయణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినపూడి శ్రీదేవి, జిల్లా ప్రధానకార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, ఆయా గ్రామాల బీజేపీ అధ్యక్షులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

పాలకొలు పట్టణం పార్వతీనగర్‌లో కాండూరి రవి నివాసంలో గుడపాటి బాబి అధ్యక్షతన మండల కమిటీ సమావేశ జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రధాని సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. గుడపాటి ఉదయ్‌ కిరణ్‌, బి శ్రీనివాస్‌, కడలి దుర్గప్రసాద్‌, వేదుల కామశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-01T05:35:10+05:30 IST