‘ఆరేసుకోబోయి పారేసుకున్న..’ బీజేపీ నేతల వైరల్ వీడియో

ABN , First Publish Date - 2022-01-03T01:07:05+05:30 IST

బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. ప్రతి కార్యకర్త నరనరాల్లో దేశభక్తి కనిపిస్తుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించేది

‘ఆరేసుకోబోయి పారేసుకున్న..’ బీజేపీ నేతల వైరల్ వీడియో

విజయవాడ: నూతన సంవత్సరం వేడుకల్లో బీజేపీ నేతలు మునిగి తేలారు. విజయవాడ నక్కల రోడ్డులో బీజేపీ విజయవాడ లోక్‌సభ నియోజకర్గ కార్యాలయంలో తెగ ఎంజాయ్ చేశారు. కొద్దిసేపు కాషాయ నేతలను అడవిరాముడు అదేనండి సీనియర్ ఎన్టీఆర్ పూనారు. సాక్షాత్తు పార్టీ కార్యాలయంలోనే ఆరేసుకోబోయి పారేసుకున్నారు. ఇక్కడ నూతన సంవత్సరం సందర్భంగా శనివారం మధ్యాహ్నం వేడుకలు నిర్వహించుకున్నారు. భారీ కేక్‌ కటింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కేక్‌ కట్‌ చేయడానికి ముందు వేదికపై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మౌలాలి, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి తదితరులు అడవిరాముడు సినిమాలోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాటకు డ్యాన్స్‌లు వేశారు. ఈ పాటకు చిత్రంలో ఎన్టీఆర్‌, జయపద్ర ఎలాంటి స్టెప్పులు వేశారో అవే స్టెప్పులను పార్టీ కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ వీడియోలు నెమ్మదిగా సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదిక పార్టీ తీరును, స్టెప్పులు వేసిన వారిని ఉతికి ఆరేస్తున్నారు. 

Updated Date - 2022-01-03T01:07:05+05:30 IST