హైదరాబాద్: నగరంలో 27న ఆదివారం బీజేపీ నేతలు ముఖ్య భేటీలు జరుపనున్నారు. హైదరాబాద్కి బీజేపీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ చేరుకున్నారు. రేపు ఉదయం రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ పార్టీల నుంచి చేరికలు ఉంటాయి. సాయంత్రం మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన భేటీ అవుతారు. పార్టీ బలోపేతం, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమీక్ష జరుపుతారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నేతలతో శివప్రకాష్ సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి