primeministerకే భద్రత లేకుంటే ఎలా?

ABN , First Publish Date - 2022-01-09T14:23:26+05:30 IST

ఇటీవల పంజాబ్‌ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తగిన భద్రత కల్పించకపోవడం పట్ల ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ

primeministerకే భద్రత లేకుంటే ఎలా?

- ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి 

- గవర్నర్‌కు బీజేపీ వినతి


చెన్నై: ఇటీవల పంజాబ్‌ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తగిన భద్రత కల్పించకపోవడం పట్ల ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి విజ్ఞప్తి చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌  పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, మాజీ ఎంపీ సీపీ రాధాకృష్ణన్‌, బీజేపీ శాసనసభాపక్ష నేత నయనార్‌ నాగేంద్రన్‌, ఎమ్మెల్యేలు వానతీ శ్రీనివాసన్‌, ఎంఆర్‌ గాంధీ తదితరులు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రధాని భద్రతలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని గవర్నర్‌కు వివరించిన నేతలు.. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమొరాండంను గవర్నర్‌కు అందజేశారు.

Updated Date - 2022-01-09T14:23:26+05:30 IST