CM KCR పై ఉద్యమకారుల ఫైర్

ABN , First Publish Date - 2022-06-11T23:20:25+05:30 IST

తెలంగాణలో అధికార పార్టీ అరాచకాలు పకాష్ఠకు చేరాయని బీజేపీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా స్పందించారు

CM KCR పై ఉద్యమకారుల ఫైర్

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ అరాచకాలు పకాష్ఠకు చేరాయని బీజేపీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా స్పందించారు.తమ‌ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.ఉద్యమకారుడు జిట్టా బాలకృష్టారెడ్డిపై కేసును బేషరతుగా కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత స్వామీగౌడ్(swamy goud) మాట్లాడుతూ తమకు న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.తనను ప్రశ్నించేవారు ఉండకూడదని కేసీఆర్ అనుకుంటున్నాడు.ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతలానిర్భందాలు లేవు. అధికార పార్టీ తన పోకడలను మార్చుకోవాలని సూచించారు.మైనర్  బాలిక ఘటనలో నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా మరో సీనియర్ నేత విజయరామారావు(vijaya rama rao) మాట్లాడుతూ జిట్టా బాలకృష్టారెడ్డిపై కేసు అన్యాయమని అన్నారు.


కేసీఆర్ ను ఇంటికి పంపించేవరకు బీజేపీ పోరాటం చేస్తోందని హెచ్చరించారు. ఎమర్జన్సీని మించి కేసీఆర్ పరిపాలన కొనసాగుతోందని ఫైర్ అయ్యారు.తెలంగాణ వస్తే నిర్భందాలు ఉండవన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి?దేవుడిని కూడా ఎదిరించగలిగిన శక్తి  కేసీఆర్ కు ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు.కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్ నియంతపాలనకు అడ్రస్ లేకుండా చేస్తాం. కేసీఆర్ వైఖరిని బొంద పెడ్తామని హెచ్చరించారు.కేసీఆర్ పరిపాలనను సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కాగా జిట్టా అరెస్టపై మరో బీజేపీ సీనియర్ నేత రవీంద్రనాయక్(ravindra naik) మాట్లాడుతూ కేసీఆర్కు వంతపాడుతోన్న ఐఏఎస్, ఐపీఎస్ లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


కేసీఆర్ దుర్మార్గాలు, అవినీతికి అధికారులు వంతపాడుతున్నారని అన్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ విలాసాలు చేస్తుకుంటున్నారని విమర్శించారు.సమస్యలు పరిష్కరించలేక కేసీఆర్ పారిపోతున్నాడని అన్నారు.విద్యార్థుల టెక్ట్స్ బుక్స్ ప్రింట్ చేయలేని ఆమర్థ సీఎం కేసీఆర్ అని విమర్శించారు.అరెస్ట్ పై జిట్టా బాలకృష్టారెడ్డి స్పందిస్తూ తనను పోలీసులు దొంగతనంగా అరెస్టు చేశారని ఆరోపించారు.కేసీఆర్ భుములను నాగళ్ళతో దున్నే కాలం దగ్గర పడిందని హెచ్చరించారు.బండి‌ సంజయ్ నాయకత్వంతోనే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు.కేసులతో బీజేపీ నాయకులను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-11T23:20:25+05:30 IST