ఏపీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం: Yadlapati

ABN , First Publish Date - 2021-10-21T17:47:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా పరిణామాలు దురదృష్టకరమని పొగాకు బోర్డు ఛైర్మన్, బీజేపీ నేత యడ్లపాటి రఘునాథ్ బాబు అన్నారు.

ఏపీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం: Yadlapati

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా పరిణామాలు దురదృష్టకరమని పొగాకు బోర్డు ఛైర్మన్, బీజేపీ నేత యడ్లపాటి రఘునాథ్ బాబు అన్నారు. ఇలాంటి పరిణామాలు రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం దోహదపడవని తెలిపారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష రెండు  పార్టీల తప్పు ఉందన్నారు. తెలుగు దేశం పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేక పోతోందని వ్యాఖ్యానించారు. అద్దాల మేడలో ఉన్న విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందన్నారు. టీడీపీని నమ్మలేక వైసీపీకి ప్రజలు ఓట్లు వేస్తే అధికార పార్టీలో ఏమాత్రం తేడా లేదని అన్నారు. సీబీఐని ఏపీకి రానివ్వకుండా చేసిన చంద్రబాబు... అమిత్ షా అపాయింట్మెంట్ ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎక్కువ కాలం తామే అధికారంలో ఉంటామని వైసీపీ, టీడీపీ భావించడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యడ్లపాటి రఘునాథ్ బాబు హితవుపలికారు. 

Updated Date - 2021-10-21T17:47:30+05:30 IST