విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ కి పోలిక ఏమిటి?..నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. జగన్‌కు దిక్కుమాలిన సలహాలు ఎవరు ఇస్తున్నారో తమకు అర్ధం కావడంలేదన్నారు. జగన్న కాలనీలకు లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఇది పక్కా ప్రభుత్వ దోపిడీ అని ఆరోపించారు. ఈ పథకానికి జగనన్న రౌడీ మామూళ్లు అని పేరు పెట్టుకుంటే బాగుండేదని యెద్దేవా చేశారు. రావాలి జగన్.. కావాలి జగన్ అన్న వాళ్ళు ఇప్పుడు.. పోవాలి జగన్ అని అంటున్నారని తెలిపారు. గజం పది వేలు రూపాయలు ఉన్న చోట ఎకరం స్థలానికి 24 లక్షల రూపాయల భారం ఉంటుందన్నారు. ప్రతి లేఅవుట్‌లో ఓపెన్ బార్, వైన్ షాపులు పెట్టుకోడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని విమర్శించారు. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని తిరిగి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకునే దుస్ధితి ఉందని విష్ణుకుమారాజు విమర్శలు గుప్పించారు.