Advertisement
Advertisement
Abn logo
Advertisement

అసదుద్దీన్ ఆఫ్ఘన్ వెళ్లాలి: విజయశాంతి

హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి. అంతకన్నా, ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. 


Advertisement
Advertisement