కేసీఆర్ హిందువు కాదా? ముస్లీమా.. క్రిస్టియనా..?: Vijayashanthi

ABN , First Publish Date - 2022-02-26T19:27:15+05:30 IST

కేసీఆర్ ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

కేసీఆర్ హిందువు కాదా? ముస్లీమా.. క్రిస్టియనా..?: Vijayashanthi

రాజన్నసిరిసిల్ల: కేసీఆర్ ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హామీపై బీజేపీ చేపట్టిన దీక్షలో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాట్లాడుతూ ఏటా రాజన్న ఆలయానికి  వంద కోట్లు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కేసీఆర్ రాక్షసుడు.. దేవాలయం అభివృద్ధి కావడం ఇష్టం లేదన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సారు జర్మనీలో కూర్చున్నారని యెద్దేవా చేశారు. ‘‘కేసీఆర్ హిందువు కాదా? కేసీఆర్ ఏమైనా ముస్లీమా...క్రిస్టియనా ... హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చింది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలతో పాటే దేవుళ్ళనూ మోసం చేస్తున్నారన్నారు. శివుడు మూడో కన్ను తెరుస్తారని.. కేసీఆర్‌ను భస్మం చేస్తాడని విజయశాంతి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-02-26T19:27:15+05:30 IST