ఏపీలో కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలి: Somuveerraju

ABN , First Publish Date - 2022-06-06T19:08:43+05:30 IST

రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.

ఏపీలో కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలి: Somuveerraju

విజయవాడ: రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు(Somuveerraju) అన్నారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై ప్రజాగ్రహ సభ నిర్వహించామని తెలిపారు. ఏపీలో జగన్ ప్రభుత్వ అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. కేంద్ర నిధులను సొంత నిధులుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీకి కేంద్రం చేసిన సాయం, అభివృద్ధిపై పుస్తకం రూపొందించినట్లు సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-06T19:08:43+05:30 IST