నేడు ముద్రగడతో భేటీకానున్న సోమువీర్రాజు

ABN , First Publish Date - 2021-01-16T15:33:34+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు భేటీకానున్నారు.

నేడు ముద్రగడతో భేటీకానున్న సోమువీర్రాజు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు భేటీకానున్నారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో రెండవ సారి ముద్రగడతో సోము సమావేశంకానున్నారు. అధికారంలోకి వస్తే కాపులకు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరాలని పలుమార్లు ముద్రగడను సోము ఆహ్వానించిన నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీ కీలకం కానుంది. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం కావడానికి బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే అటు అధికార పార్టీని.. ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం.. మరీ ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను, మాజీలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రులను సైతం పార్టీలో చేర్చుకోవాలని నేతలు ప్రయత్నాలు షురూ చేశారు. ఇప్పటికే పలువుర్ని పార్టీలో చేర్చుకున్న సోమువీర్రాజు మరికొంత మంది కీలక నేతలతో భేటీ అయ్యి వారికి ఢిల్లీ పెద్దల చేత కాషాయ కండువాలు కప్పేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2021-01-16T15:33:34+05:30 IST