Somuveerraju: టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలు... ట్రేడింగ్ పార్టీలు: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-07-27T17:41:40+05:30 IST

ఏపీలో టీడీపీ, వైసీపీలు బీజేపీపై బురద జల్లుతున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు.

Somuveerraju: టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలు... ట్రేడింగ్ పార్టీలు: సోమువీర్రాజు

విజయవాడ: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ (YCP)లు బీజేపీ(BJP)పై బురద జల్లుతున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (somu veerraju) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రెండు పార్టీలు కుటుంబ పార్టీలని... ట్రేడింగ్ పార్టీలని అన్నారు. వైసీపీ, టీడీపీ గూడిపుటానీ చేస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీలది ధృతరాష్ట్ర కౌగిలి కాదని... వాళ్ళది ఆత్మీయ కౌగిలని వ్యాఖ్యలు చేశారు. 2014లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒకే చెప్పి డబ్బులు తీసుకున్నారని... అయినా టీడీపీ ఎంపీ పార్లమెంట్‌లో హోదా గురించి అడుగుతారన్నారు. వైసీపీ అప్పుడు మాట్లాడలేదు కానీ.. ఇప్పుడు హోదాకోసం వినతి పత్రాలు ఇస్తుందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం డబ్బులు ఇవ్వడం లేదని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.


కేంద్రం రూ.15 వేల కోట్లు ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి డబ్బులు ఇస్తామన్న సీఎం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలవరం కట్టలేక చంద్రబాబు, జగన్ చేతులేత్తేశారన్నారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు పంచిపెట్టమని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. జనసేన, బీజేపీకి ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయని..బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని స్పష్టం చేశారు. తమ రాజకీయ వ్యవహారాలు భయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 43 ఏళ్ళుగా రాజకీయాల్లోనే ఉన్నానని.. ఇకపై కూడా రాజకీయాల్లోనే ఉంటానని సోమువీర్రాజు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-27T17:41:40+05:30 IST