ఎంఐఎం కోసమే జీహెచ్ఎంసీలో కొత్త చట్టం : లక్ష్మణ్

ABN , First Publish Date - 2020-10-17T21:47:04+05:30 IST

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సోమవారం బీజేపీ నేత లక్ష్మణ్ ఢిల్లీలో బాధ్యతలు తీసుకోనున్నారు.

ఎంఐఎం కోసమే జీహెచ్ఎంసీలో కొత్త చట్టం : లక్ష్మణ్

హైదరాబాద్ : బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సోమవారం బీజేపీ నేత లక్ష్మణ్ ఢిల్లీలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలసి తాను తీసుకుంటానని తెలిపారు. తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం తీసుకురావటమే బీజేపీ లక్ష్యమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని జనరల్ స్థానాలను బీసీ అభ్యర్థులకు బీజేపీ కేటాయిస్తోందన్నారు.


ఎంఐఎం కోసమే కొత్త చట్టం..

జీహెచ్ఎంసీ కొత్త చట్టంతో బీసీలను తీరని అన్యాయమని.. ఎంఐఎం కోసమే జీహెచ్ఎంసీలో కొత్త చట్టాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలవబోతోందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి వస్తారో.. రారో కాలం నిర్ణయిస్తోందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ బీజేపీ వేగంగా బలపడుతోందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తోందని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.



Updated Date - 2020-10-17T21:47:04+05:30 IST