Abn logo
Sep 25 2021 @ 11:50AM

దీన్ దయాల్ స్పూర్తితో నరేంద్రమోదీ పరిపాలన: లక్ష్మణ్

హైదరాబాద్: దీన్ దయాల్ స్ఫూర్తితోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన చేస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. దీన్ దయాల్ జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్, డీకే అరుణ్ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ దీన్ దయాల్ జీవితాంతం పేదలు, వెనుకబడి వర్గాల కోసం పని చేశారన్నారు. రాజకీయంగా దీన్ దయాల్ ఉపాధ్యాయను విభేదించినా.. అన్ని పార్టీల వారు గౌరవించే వ్యక్తి అని తెలిపారు. ఆత్మ నిర్బర్ భారత్‌తో మోదీ ముందుకు వెళుతున్నారని లక్ష్మణ్ అన్నారు. 


డీకే అరుణ మాట్లాడుతూ...దీన్ దయాల్ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందన్నారు. మొక్కలు పెంచడమే ఆయనకు సరైన నివాళి అని అన్నారు. నవ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...