అమరావతి: ప్రజల విశ్వాసాన్ని సీఎం జగన్ కోల్పోయారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. ఉద్యోగులపైన జగన్‌రెడ్డికి కనీసం సవతితల్లి ప్రేమ కూడా లేదన్నారు. పీఆర్సీ జీవో తో ప్రభుత్వ చేతగానితనం బయటపడిందని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను నేడు జగన్ తప్పారని ఆయన ఆరోపించారు. మంత్రి పేర్నినానికి బీజేపీ వల్ల వచ్చిన ఉద్యోగాల వివరాలు తెలియాలంటే వైసీపీ ఏంపీలతో పార్లమెంటులో ప్రశ్నవేస్తే సమాధానం వస్తుందని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి