అమరావతి: జగన్ పాలనలో అభివృద్ధి కంటే వ్యాపార ఛాయలు ఎక్కువయ్యాయని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త విధానాలతో దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల విషయంలో జనం నెత్తిన పిడుగు వేయడం జగన్ మార్క్ పాలన అని దుయ్యబట్టారు. కట్టిన ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా, కొత్త ఇండ్లు సరిగ్గా కట్టకుండా ఈ ప్రభుత్వం పేదల నుండి వసూళ్లు మొదలెట్టిందన్నారు. పేదలకు నవరత్నాలు అంటూ నెత్తిన నవశఠగోపాలు పెడుతున్న దందాల ప్రభుత్వం అయ్యిందంటూ లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.