జాతీయ చిహ్నంపై అనవసర రాద్ధాంతం: Lanka dinakar

ABN , First Publish Date - 2022-07-13T17:10:44+05:30 IST

నూతన పార్లమెంట్ భవన నిర్మాణం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంపైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు.

జాతీయ చిహ్నంపై అనవసర రాద్ధాంతం: Lanka dinakar

అమరావతి: నూతన పార్లమెంట్ భవన నిర్మాణం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం(National symbol)పైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ(BJP) నేత లంకా దినకర్(Lanka dinakar) మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విగ్రహంలో సింహం గుణగణాలను మార్చారని విమర్శ చేసే వారికి సద్గుణం ప్రాప్తించాలని కోరుకున్నారు. విగ్రహం పరిమాణం పెరిగినప్పుడు గంభీరంగా కనబడడం సహజం, సింహం గుణగణాలు ఎక్కడైన మారిపోతాయా అని ప్రశ్నించారు. "సత్యమేవ జయతే నుంచి సింహమేవ జయతే" కి మారింది అనేవారు, రేపు అసలు సింహాలేందుకు అన్నా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యలు చేశారు. విమర్శించడానికి అవకాశం లేనప్పుడు ఇటువంటి ప్రచారాలు చేస్తారని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-07-13T17:10:44+05:30 IST