‘ఆర్థిక అరాచకాలు కప్పిపుచ్చేందుకే అకౌంటింగ్ అరాచకాలకు తెర’

ABN , First Publish Date - 2022-06-30T19:58:29+05:30 IST

రాష్ట్రంలో ఆర్థిక అరాచకాలను కప్పిపుచ్చడానికి అకౌంటిగ్ అరాచకాలకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

‘ఆర్థిక అరాచకాలు కప్పిపుచ్చేందుకే అకౌంటింగ్ అరాచకాలకు తెర’

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక అరాచకాలను కప్పిపుచ్చడానికి అకౌంటిగ్ అరాచకాలకు జగన్(Jagan) ప్రభుత్వం తెరలేపిందని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల పీఏఫ్ ఏంటీ...  ప్రజల సేవింగ్స్ ఖాతాల సొమ్ములు లాగేసే అవకాశం ఉంటే జగనన్న వదిలేలాలేడని యెద్దేవా చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి  కాగ్‌కు సమర్పించిన నెలవారీ ఇండికెటర్లు చూస్తే ఆలీబాబ అరడజన్ దొంగల లీలలు లాగా కనబడతున్నాయన్నారు. రాష్ట్రంలో మూలధన వ్యయం ఏంత అంటే చెప్పుకోలేని ధౌర్భాగ్యం... కానీ దొంగ లెక్కలతో దేశంలోనే అధికం అని చెబుతారేమో అని అన్నారు. మద్యం హనికరమని బాటిల్‌పైన పుర్రె బొమ్మతో రాసి, మద్యం నిషేధమని ఆదాయం కోసం నాణ్యమైన మద్యం అని ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. 18 కోట్లు ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలకు రాష్ట్రంలో లేవు కాని కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాలలో విదేశీ ప్రయణాలు ఆగడం లేదని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-30T19:58:29+05:30 IST