Cmకు నల్లజెండాలతో నిరసన తెలుపుతాం: బీజేపీ

ABN , First Publish Date - 2022-06-05T15:33:17+05:30 IST

జిల్లాలో పర్యటించనున్న సీఎం స్టాలిన్‌కు నల్లజెండాలతో నిరసన తెలుపుతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాత్యాయని తెలిపారు. నగరంలో శనివారం ఆమె

Cmకు నల్లజెండాలతో నిరసన తెలుపుతాం: బీజేపీ

వేలూరు(చెన్నై), జూన్‌ 4: జిల్లాలో పర్యటించనున్న సీఎం స్టాలిన్‌కు నల్లజెండాలతో నిరసన తెలుపుతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాత్యాయని తెలిపారు. నగరంలో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, డీఎంకే నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం నిరంతం కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, కేంద్రం మాత్రం రాష్ట్రాభివృద్ధికి నిధులు అందజేస్తోందన్నారు. డీఎంకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. వేలూరు స్మార్ట్‌ సిటీ పథకం సక్రమంగా అమలుకాకపోవడంతో సుమారు రూ.300 కోట్ల నిధులు వెనక్కు వెళ్లాయని తెలిపారు. ప్రధాని పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌ ప్రత్యక్ష ప్రసార సమయంలో టీవీని ‘మ్యూట్‌’ చేయమన్న ఎంపీ కదిర్‌ ఆనంద్‌ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వేలూరు కొత్త బస్టాండ్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మనోహరన్‌, జనరల్‌ సెక్రటరీ జగన్‌, బాబు, శరవణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-05T15:33:17+05:30 IST