Abn logo
Jul 31 2021 @ 11:06AM

Etela rajendar కోలుకోవాలని బీజేపీ శ్రేణులు, అభిమానుల పూజలు

వరంగల్ అర్బన్: తీవ్ర జ్వరంతో  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో బీజేపీ శ్రేణులు, అభిమానులు పూజలు నిర్వహించారు.  హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల వ్యాప్తంగా పూజలు, అర్చనలు చేశారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని....అతి త్వరలోనే ప్రజాదీవెన యాత్రతో వస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. ఈటల రాజేందర్  ఆరోగ్యం నిలకడగా ఉందని... వైద్య పరీక్షల తరువాత పూర్తి సమాచారం అందిస్తామని ఈటల కుటుంబసభ్యులు తెలియజేశారు.