Abn logo
Sep 25 2021 @ 11:28AM

తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్: Etela

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌, కౌశిక్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్’’ అని వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్న వారికి దళిత బందు ఇవ్వరా అని  ప్రశ్నించారు. ఏం పదవి ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని  మండిపడ్డారు. తన రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్‌లో ఎంట్రీ దొరికిందన్నారు. పదవి కూడా రాబోతుందని... ఈ విషయం ప్రజలకు తెలుసని ఈటెల అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption