Abn logo
Sep 24 2021 @ 14:06PM

నేను సీఎం పదవి కోసం పోటీ పడలేదు: Etela

కరీంనగర్: హుజురాబాద్‌లో వ్యాన్ల కొద్దీ మద్యాన్ని పంచుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. హరీష్ రావు మార్కెట్‌లో వస్తువుల బదులు మనుషులను కొంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ మీటింగ్‌కు రాకపోతే పథకాలు రావు అని బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మీద పోరాడింది తానే అని చెప్పుకొచ్చారు. తాను సీఎం పదవి కోసం పోటీ పడలేదన్నారు. రెండు గుంటల భూమి ఉన్నోడు రెండు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అక్రమ సంపాదనకు, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని ఈటల తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption