Abn logo
Oct 21 2021 @ 12:51PM

దళిత బంధును ఎవరో ఆపుతున్నట్టు దుష్ప్రచారం: Etela

హనుమకొండ : దళిత బంధును ఎవరో ఆపుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇవాళ కమలాపూర్ మండలం మర్రిపల్లిలో ఈటల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మాట తప్పను అన్నారు.. అవసరమైతే తల నరుక్కంటా అన్నారు.. ఎప్పుడూ దళితులను మోసం చేస్తూనే ఉంటాడు కేసీఆర్’’ అని వ్యాఖ్యానించారు. దళితులకు సబ్సీడీ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని.. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదని కేసీఆరర్ సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. దళితబంధుతో మోసం చేస్తున్నారని ఎవరూ అనట్లే అహో.. ఓహో అంటున్నారని తెలిపారు. దళితులకు తప్పకుండా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేసినా.. డిమాండ్ చేస్తున్నా కూడా అని స్పష్టం చేశారు.

హుజూరాబాద్ దెబ్బకే ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళస్థలాలు ఉన్నవాళ్ళకీ ఇండ్లు కట్టుకునే జీవో వస్తున్నాయని అన్నారు. ఎన్నికలు ఉంటేనే హమీలు, చెక్కులు ఇస్తారని.. ఇది కేసీఆర్ నైజమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటలను ఓడగొట్టలనే ఇన్ని హమీలు, ఇన్ని నిధులు ఈ నియోజకవర్గానికి ఇచ్చారని అంతేకానీ.. ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని తెలిపారు. ‘‘కేసీఆర్‌కు ఎప్పటికీ నేను, నా కొడుకు రాజ్యం.. పాలన ఉండాలనే తపన’’ ఉంటుందన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు బిల్లులు, డబ్బులు ఈటల వలనే వస్తున్నాయని చెప్పారు. 30 తరువాత వీళ్ళ అందరీ బతుకు బజారుపాలే అని.. ఎవరు పట్టించుకోరు వీళ్ళను అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండిImage Caption