Abn logo
Sep 13 2021 @ 17:44PM

హరీష్‌రావు ఓ రబ్బర్ స్టాంప్: ఈటల

హుజురాబాద్: టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఓ రబ్బర్ స్టాంప్ అని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. " నేను సీఎం కావాలని అనుకున్నానా.. గుండె మీద చెయ్యి వేసి చెప్పు హరీష్ రావు" అని హరీష్ రావును ఈటల సూటిగా ప్రశ్నించారు. అడుగులకు మడుగులు ఒత్తితేనే ప్రగతి భవన్‌కు ఎంట్రీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాను రాజీనామా చేయలేదని, తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయాలని చెబితేనే తాను రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేసారు. హరీష్‌రావు లాగా తాను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని, హరీష్‌కు ఆయన మామ ఉన్నాడని ఆయన ఎద్దేవా చేసారు. హుజురాబాద్ ఎన్నిక రిహార్సల్ మాత్రమేని ఈటల అన్నారు.