Abn logo
Sep 15 2021 @ 18:04PM

కేటీఆర్ చేతకాని దద్దమ్మ: డీకే అరుణ

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ చేతకాని దద్దమ్మ అంటూ అరుణ ఘాటుగా విమర్శించారు. ABNతో బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ మాట్లాడారు. గద్వాల్ జిల్లా అభివృద్ధిపై కేటీఆర్‌తో చర్చకు తాను సిద్దమని సవాల్ విసిరారు. కేటీఆర్ కాదు.. కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేసారు. అబద్దాలుకు మారుపేరుగా కల్వకుంట్ల కుటుంబం మారిందని ఆరోపించారు. తనపై విమర్శలు చేసే సమర్థత కేటీఆర్‌కు లేదన్నారు.


రాష్ట్రాల అభివృద్ధికి సహకరించటం కేంద్రం బాధ్యత అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చినట్లే కేసీఆర్’కు కేంద్ర పెద్దలు అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నారు.  అమిత్ షా నిర్మల్ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు సెప్టెంబర్ 17చరిత్ర తెలియకపోవటం హాస్యాస్పదమన్నారు. సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించే వరకు బీజేపీ పోరాడుతోందని అరుణ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption