పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి మిథున్ చక్రవర్తి?

ABN , First Publish Date - 2021-03-07T17:32:49+05:30 IST

హిందీ, బెంగాలీ సినిమాల్లో పేరు పొందిన నటుడు...

పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి మిథున్ చక్రవర్తి?

కోల్‌కతా: హిందీ, బెంగాలీ సినిమాల్లో పేరు పొందిన నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నారు. ఈరోజు కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలో మిథున్ చక్రవర్తి పాల్గొని బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బెంగాల్ బీజేపీ ఇన్‌ఛార్జి కైలాస్ విజయ్ గార్గెయ్ శనివారం రాత్రి మిథున్ చక్రవర్తిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా... మిథున్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ను అడగగా... ముందు ఆయనను బీజేపీలో చేరనివ్వండి... దీని గురించి నా దగ్గర ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి లేదని అన్నారు. మిథున్ ప్రధానిని కలుసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు. 

Updated Date - 2021-03-07T17:32:49+05:30 IST