అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నాం: బీజేపీ

ABN , First Publish Date - 2020-09-22T16:35:30+05:30 IST

అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ కొనసాగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ స్పష్టం చేశారు. మదురైలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నాం: బీజేపీ

చెన్నై (ఆంధ్రజ్యోతి) : అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ కొనసాగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ స్పష్టం చేశారు. మదురైలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో  మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదింపజేసిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తుందని, తమ ఉత్పత్తులను ఏ ప్రాంతంలోనైనా విక్రయించుకునే వెసలుబాటు కలుగుతుందని చెప్పారు. ఈ బిల్లుల వల్ల వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే గిడ్డంగుల సంఖ్య విపరీతంగా పెరుగుతాయని, దీంతో రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర లభించినప్పుడు విక్రయించుకోవచ్చునని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ పార్టీ కూటమిలోనే తాము కొనసాగుతున్నామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, తమ పార్టీలో చేరే వారి సంఖ్య కూడా అధిక మవుతోందని, తమ పార్టీ ఓటు బ్యాంకు కూడా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయని చెబుతూ బీజేపీ ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే 30 నియోజకవర్గాలను సునా యసంగా గెలుచుకునే అవకాశం ఉందని మురుగన్‌ ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుండి విడుదలైన తర్వాతే రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ మార్పులు గురించి తెలుస్తాయని ఆయన చెప్పారు.

Updated Date - 2020-09-22T16:35:30+05:30 IST