కడప: బద్వేలు పరిధిలో బీజేపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేత సీఎం రమేష్ అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఉపఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను కాకుండా స్థానిక పోలీసులను రక్షణగా ఉంచుతున్నారన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులను మోహరించారని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.