Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులతో పెట్టుకోకండి: భాను ప్రకాష్‌రెడ్డి

నెల్లూరు: ఎవరితోనైనా పెట్టుకోండని, కానీ రైతులతో పెట్టుకోవద్దని సీఎం జగన్‌ను బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో జరుగుతున్న రాజధాని రైతుల మహాపాదయాత్రకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, నేతలు భానుప్రకాష్‌రెడ్డి, రావెల కిశోర్‌బాబు, కోలా ఆనంద్, దినకర్, సామంచి శ్రీనివాస్, నాబోతు రమేష్‌నాయుడు, దయాకర్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారికి పెట్టే నైవేద్యం కూడా రైతులు పండించిన ధాన్యంతోనే తయారు చేస్తారన్నారు. స్వామివారి సుదర్శన చక్రానికి.. రైతులు చేపట్టిన ఉద్యమానికి తిరుగులేదని ఆయన స్పష్టం చేశారు. 


Advertisement
Advertisement