కేసీఆర్ డౌన్ ఫాల్ మొదలైంది: Bandi sanjay

ABN , First Publish Date - 2022-06-10T17:18:03+05:30 IST

సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ మెదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ డౌన్ ఫాల్ మొదలైంది: Bandi sanjay

హైదరాబాద్: సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ మెదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) అన్నారు.  శుక్రవారం ఉదయం ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జేబీఎస్‌లో ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించేందుకు బండిసంజయ్ బంజారాహిల్స్ నుంచి జేబీఎస్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో అర్థం కాలేదన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని... అరెస్ట్‌లు, జైళ్లకు భయపడమని స్పష్టం చేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచితే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. అర్ధరాత్రి జిట్టాను అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఉద్యమకారులను అరిగోసా పెడుతున్నారని, ద్రోహులను సంకన వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆర్టీసీ ప్రయాణీకులతో మట్లాడేందుకే జూబ్లీ బస్టాండుకు వెళ్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. 


అంతకు ముందు జేబీఎస్ పేరుతో డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తారన్న అనుమానంతో సంజయ్‌ను పోలీసులు‌ హౌస్ అరెస్టు చేశారు. అర్థరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్టారెడ్డి (Balakrishna Reddy)ని ఘట్ కేసర్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 2న‌ అమరుల యాదిలో  ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌పై స్కిట్ చేసి అగౌరవపరిచారంటూ జిట్టాపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జిట్టాను అరెస్టు చేయటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తారన్న అనుమానంతో ముందస్తుగా ఆయనను హౌస్ అరెస్టు చేశారు.

Updated Date - 2022-06-10T17:18:03+05:30 IST