Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయి: Bandi sanjay

హైదరాబాద్‌: రెండోరోజు తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ  బీజేపీని బద్నాం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయని ఓ జ్యోతిష్యుడు తనకు చెప్పారన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వ్యవస్థలను టీఆర్‌ఎస్‌ నాశనం చేసిందని విమర్శించారు. డిసెంబర్ 17 నుంచి మళ్లీ పాదయాత్ర మెదలు పెట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ పాదయాత్రతో టీఆర్ఎస్ పతనం మెదలైందని సంజయ్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement