బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు తిరగబడితే టీఎంసీ పరిస్థితేంటి?: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-05-05T19:25:59+05:30 IST

బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ దాడులపై కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్ష చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు తిరగబడితే టీఎంసీ పరిస్థితేంటి?: బండి సంజయ్

హైదరాబాద్: బెంగాల్లో బీజేపీ  కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ దాడులపై కరోనా నిబంధనలు పాటిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్ష చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బెంగాల్ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్‌కు అప్పగించేలా పాలన జరుగుతోందని ప్రజలకు చెప్పామని అన్నారు. రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు బెంగాల్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డాగా మార్చారని విమర్శించారు. గతంలో బెంగాల్లో 3 సీట్లు మాత్రమే ఉండేదని..కానీ ఇప్పుడు 79 సీట్ల  గెలిచామన్నారు. బెంగాల్లో బీజేపీ విస్తరిస్తుందని ఆయన తెలిపారు. బెంగాల్‌ను రక్షించేందుకు బీజేపీ జాతీయ వాదులు పని చేస్తున్నారని..కానీ బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులతో కలిసి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దమన కాండ జరుగోతందని...రాక్షసి మాదిరిగా బెంగాల్ సీఎం వ్యవరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ... మమతా బేగంగా పేరు మార్చుకోవాలని హితవుపలికారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారన్నారు. విదేశీ నిధులతో,  రోహింగ్యాలు ఇచ్చిన నిధులతో మమతా బెనర్జీ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?  అని ప్రశ్నిస్తూ... బెంగాల్లో కర సేవ చేయాల్సి వస్తుందనీ మమత బెనర్జీనీ  హెచ్చరిస్తున్నామన్నారు. బెంగాల్ బీజేపీ కార్యకర్తలకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చెబుతున్నామని బండి సంజయ్ తెలిపారు. 

Updated Date - 2021-05-05T19:25:59+05:30 IST