తెలంగాణలో కేసీఆర్ మాకు అస్త్రం: Bandi sanjay

ABN , First Publish Date - 2022-02-09T17:33:22+05:30 IST

‘‘తెలంగాణలో కేసీఆర్ మాకు అస్త్రం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

తెలంగాణలో కేసీఆర్ మాకు అస్త్రం: Bandi sanjay

న్యూఢిల్లీ/తెలంగాణ: ‘‘తెలంగాణలో కేసీఆర్ మాకు అస్త్రం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల డ్రామాలు ప్రజలు నమ్మరు అని గుర్తుకు పెట్టుకోవాలని అన్నారు. రాజ్యాంగంతో ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ ఇప్పటికి వరకు చెప్పలేదన్నారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్తామన్నారు. కాంగ్రెస్‌ను తిడితే టీఆర్ఎస్‌కు నొప్పి ఏంటో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు.


మోడీ ఏమైనా తెలంగాణ బిల్లును అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక జోకర్ అయ్యారని యెద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్ అని... ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పెప్పర్ స్ప్రే కొట్టినా పారిపోకుండా తెలంగాణ బిల్లుకు నిలబడింది సుష్మాస్వరాజ్ అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంపై కేసీఆర్‌కు ఇంట్రస్ట్ లేదన్నారు. కేసీఆర్ కాబినెట్‌లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారని నిలదీశారు. అమరవీరుల ఆత్మలు గోషిస్తున్నాయన్నారు. సుష్మాస్వరాజ్ తెలంగాణ బిల్లు పెడతారా లేదా అని హెచ్చరిస్తే కాంగ్రెస్ బిల్లు పెట్టిందని బీజేపీ నేత చెప్పుకొచ్చారు.


కేసీఆర్ సెంటిమెంట్ ఎవరు నమ్మరని తెలిపారు. నీళ్లపై అన్యాయం జరిగితే మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఫౌం హౌస్‌లో పండుకున్నారా అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏం చేసింది...ఏమైనా కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం కాదు, కేసీఆర్ విగ్రహం పెట్టుకుంటారా? అని అన్నారు. తెలంగాణ విభజనను మోడీ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిని కేసీఆర్ కలిసినప్పుడు విభజన హామీలు గుర్తుకు రాలేదా? అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2022-02-09T17:33:22+05:30 IST