Abn logo
Sep 16 2021 @ 13:04PM

రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తాం: బండి సంజయ్

కామారెడ్డి: రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. గురువారం నాగిరెడ్డిపేట్ మండలం బంజారా తండాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రేపు నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అమిత్ షా ఈ సభకు హజరవుతారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దరిద్ర, దీన స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ మొట్ట మొదటి ద్రోహి కేసీఆర్ అని అన్నారు.కేసీఆర్ నయా నిజామని దుయ్యబట్టారు. కేంద్రం నిధులివ్వకపోతే టీఆరఎస్ ఎంపీలు ఎందుకు పార్లమెంటులో ప్రశ్నిచటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సంస్కార హీనుడన్నారు. పాతబస్తీలో అడుగుపెట్టే ధైర్యం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ లేదన్నారు. ఢిల్లీలో వంగివంగి మొక్కిన పిరికోడు కేసీఆర్ అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption