గద్వాల: జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రజలందరూ మరొక పోరాటానికి ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుణ మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ ప్రాంత ప్రజలు అవమానానికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో ఇచ్చిన 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు అలంపూర్‌లో నేటికీ రూపుదాల్చకపోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు.