గోవాలో బీజేపీ ఘనవిజయం

ABN , First Publish Date - 2022-08-14T08:35:24+05:30 IST

గోవా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.

గోవాలో బీజేపీ ఘనవిజయం

పణజీ, ఆగస్టు 13: గోవా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 186 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 140 స్థానాల్లో గెలుపొందింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ శనివారం వెల్లడించారు. ఈ విజయాన్ని తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా అభివర్ణించారు. గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్‌ షేట్‌ తనవాడే మాట్లాడుతూ.. గోవా పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఓ పార్టీ ఈ స్థాయి విజయం సాధించడం ఇదే తొలిసారన్నారు. కాగా, గోవాలో ఈ నెల 10న మొత్తం 186 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 78.70 శాతం పోలింగ్‌ నమోదైంది.   

Updated Date - 2022-08-14T08:35:24+05:30 IST