Abn logo
Sep 19 2021 @ 00:29AM

పేదల నడ్డి విరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

రేషన షాపులను తనిఖీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా 

గుంటూరు(సంగడిగుంట), సెప్టెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు విద్యుత చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తుందని బీజేపీ రాష్ట్ర  మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం  నగరంలోని పలు రేషన దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ మోదీ ఫ్లెక్సీలు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ట్రూ అప్‌ పేరుతో పెంచిన విద్యుత చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ నాయకుడికి భాష, ప్రవర్తన ముఖ్యమని ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీల నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిదిగా జగన వ్యవహారం ఉందని విమర్శించారు. రేషన బియ్యంలో కేంద్రం సబ్సిడీ ఉన్నా వైఎస్‌, జగన ఫొటోలతో రాష్ట్రం ప్రచారం చేసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, నాయకులు శనక్కాయల అరుణ, వల్లూరు జయప్రకాష్‌ నారాయణ, బిట్రా శివన్నారాయణ, రమాకుమారి, నిజాముద్దీన, నీలం ప్రసాద్‌, లక్ష్మణ్‌, అనుమోలు ఏడుకొండలు, పాలిశెట్టి రఘు, వనమా నరేంద్ర, వెలగలేటి గంగాధర్‌, దేసు సత్యనారాయణ, నమ్రత, రమాదేవి, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.